Job Type | Department | Start Date | End Date |
---|---|---|---|
Govt | Banks | 2016-08-31 | 2017-04-30 |
బ్యాంక్ ఉద్యోగాల కోసం కోచింగులు తీసుకుంటూ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక గొప్ప శుభవార్త. బ్యాంకులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 19 బ్యాంకుల్లో 19,243 క్లర్క్ క్యాడర్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ తాజాగా కామన్ రిటన్ ఎగ్జామినేషన్(సీడబ్ల్యూఈ) VI నిర్వహణకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఐబీపీఎస్ సీడబ్ల్యూఈ-VI ఆధారంగా అభ్యర్థులను నియమించుకోనున్న బ్యాంకులు...
భాగస్వామ్య బ్యాంకులు:
అలహాబాద్ బ్యాంక్ - Alahabad Bank
ఆంధ్రా బ్యాంక్ - Andhra Bank
బ్యాంక్ ఆఫ్ బరోడా - Bank of Baroda
బ్యాంక్ ఆఫ్ ఇండియా - Bank of India
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - Bank of Maharashtra
కెనరా బ్యాంక్ - Canara Bank
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - Central Bank of India
కార్పొరేషన్ బ్యాంక్ - Corporation Bank
దేనా బ్యాంక్ - Dena Bank
ఇండియన్ బ్యాంక్ - Indian Bank
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - Indian Overseas bank
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ - Oriental Bank of Commerce
పంజాబ్ నేషనల్ బ్యాంక్ - Punjab National Bank
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ - Punjab and Sindh Bank
సిండికేట్ బ్యాంక్ - Syndicate bank
యుకో బ్యాంక్ - UCO Bank
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - Union Bank of India
యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - United Bank of India
విజయా బ్యాంక్ - Vijaya Bank
ఖాళీలు:
ఆంధ్రప్రదేశ్: 699
తెలంగాణ: 546
విద్యార్హత: డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్స్ లో తప్పనిసరిగా సర్టిఫికెట్/డిప్లొమా/డిగ్రీ కోర్సు చేసుండాలి. లేదా హైస్కూల్/కళాశాల/యూనివర్సిటీ స్థాయిలో కంప్యూటర్స్ ను ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నా సరిపోతుంది.
వయసు పరిమితి: 2016, ఆగస్టు 1 నాటికి కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ లతో పాటు ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం: ఆన్-లైన్ లో నిర్వహించే ఉమ్మడి రాత పరీక్ష (సీడబ్ల్యూఈ)-VI లో రెండు దశలు ఉంటాయి. ఒకటి... ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. రెండు... మెయిన్ ఎగ్జామినేషన్.
1. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (గంట వ్యవధి):
పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు ఈ మూడు విభాగాల్లో విడివిడిగా కనీస మార్కులు పొందాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారిని మెయిన్ ఎగ్జామినేషన్ కు అనుమతిస్తారు.
2. ప్రధాన పరీక్ష (మెయిన్ ఎగ్జామినేషన్):
135 నిమిషాల (2 గంటల 15 నిమిషాల) వ్యవధి ఉండే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో 5 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకు విభాగాల వారీగా నిర్దేశిత సమయంలో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి విభాగంలోనూ, మొత్తంమీద కనీస మార్కులు సాధించాలి.
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్-మెన్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ చార్జీల కింద రూ.100; ఇతర అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు
ముఖ్య తేదీలు :
ఆన్-లైన్ దరఖాస్తు ప్రారంభం: 22 ఆగస్టు 2016
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12 సెప్టెంబర్ 2016
ఫీజును ఆన్-లైన్లో చెల్లించేందుకు చివరి తేదీ: 12 సెప్టెంబర్ 2016
ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు హాల్ టికెట్ల డౌన్-లోడ్ ప్రారంభ తేదీ: 18 నవంబర్ 2016
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తేదీలు: 26, 27 నవంబర్; 3, 4 డిసెంబర్ 2016,
ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల వెల్లడి: డిసెంబర్ 2016
మెయిన్ ఎగ్జామినేషన్ కు హాల్ టికెట్ల డౌన్-లోడ్ ప్రారంభం: డిసెంబర్ 2016
మెయిన్ ఎగ్జామినేషన్ తేదీలు: 31 డిసెంబర్ 2016, 1 జనవరి 2017
ప్రోవిజనల్ అలాట్-మెంట్: ఏప్రిల్ 2017
పూర్తి వివరాలు వెబ్-సైట్‌లో చూడొచ్చు. వెబ్-సైట్ ను సందర్శించేందుకు ఈ లింకు పై క్లిక్ చేయండి: www.ibps.in
Comments
Post a Comment