అబ్బో…శ్వేతా బసు మళ్ళీ వస్తుందిగా ?
”కొత్తబంగారు లోకం” సినిమాతో సంచలనం క్రియేట్ చేసి .. హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది శ్వేతా బసు ప్రసాద్. ఆ సినిమా తరువాత సరైన సినిమాలు ఎంపిక చేసుకోకుండా .. ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి క్రేజ్ తగ్గించుకుంది. ఆ తరువాత వ్యభిచారం కేసులో పట్టుబడి సంచలనం రేపిన ఈ భామ, ఆ కేసు నుండి బయటపడి కొన్ని రోజులు బాలీవుడ్ లోకి వెళ్ళింది. చాలా రోజుల వరకు తెలుగు సినిమాలు చేయని ఈమె ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తుంది ?
సతీష్ కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న ”మిక్చర్ పొట్లం” అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. మాస్ మసాలా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ తన హవా చాటుకోవడానికి రెడీ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మరి ఈ సినిమాతో శ్వేతా ఎలా కనిపిస్తుందో అంటూ జనాలు ఆసక్తి గా ఎదురుకి చూస్తున్నారు ?
Comments
Post a Comment