ప్రపంచంలో ఏ దేశంలో చూసినా మీడియా వారు రాబట్టినన్ని వార్తలు ఎవరు రాబట్టలేరు. అప్పుడప్పుడు వీరికి ఈ వార్త ఎలా తెలిసింది అనే సందేహం కూడా వాస్తుంది. కొన్ని ఛానల్స్ రాజకీయ నేతలకు సపోర్ట్ చేస్తాయి... ఇంకొన్ని బిజినెస్ పీపుల్ కి సపోర్ట్ చేస్తాయి.. ఇంకొన్ని సిని పరిశ్రమ వాళ్లకి సపోర్ట్ చేస్తాయి.. ఇలా ఎవరో ఒకరికి సపోర్ట్ చేస్తున్న ఛానల్స్ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా ఉన్నాయి. తాజాగా తెలుగు మీడియా రంగంలో వస్తున్న వార్తలు పెద్ద సంచలనాలకే తెరతీస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు మీడియా ఛానల్ రంగంలో టీవీ 9 అగ్ర స్థానంలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సంచలన వార్తల నుండి ఎలాంటి విషయాన్నైనా ప్రశ్నించడంలో ఈ ఛానల్ ప్రత్యేకత మరో ఛానెల్ కి లేదు. ఈ ఛానెల్ అగ్ర స్థాయిలో నిలబడడానికి ఇదే ప్రథమ కారణం. తెలుగు మీడియా రంగంలో టీవీ 9 తర్వాత ఎన్నో ఛానెల్స్ వచ్చాయి. కాని టీవీ 9 స్థాయిని అందుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో టీవీ 9 తిరుగులేని ఛానెల్ గా నిలిచిపోయింది.
అయితే, ఇటీవల కాలంలో ఈ ఛానెల్ లో వార్తలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఇదివరకు బాబు పై విమర్శలు కురిపించడంలో విపక్ష వైకాపా అధినేత జగన్ టీవీ సాక్షి ముందుండేది. ఇప్పుడు ఆ లిస్టులో టీవీ 9 కూడా చేరిపోయింది. ముఖ్యంగా రాజధాని అమరావతి భూముల వ్యవహారంపై ఎక్కువ కథనాలు ప్రసారం అయ్యాయని సమాచారం. అదేవిధంగా ప్రత్యేక హోదాపైనా టీవీ 9 పెద్ద ఎత్తున ప్రసారం చేసింది. ఇక, అధికార పార్టీ అవినీతి ఎమ్మెల్యేలపై రోజుకో కథనంతో విరుచుకుపడింది. దీంతో ఈ ఛానెల్ కు చెక్ పెట్టాలని చంద్రబాబు భావించినట్టు తెలుస్తోంది.
ఈక్రమంలో టీవీ 9 వంటి బలమైన ఛానెల్ కు చెక్ పెట్టేందుకు ఆయన పావులు కదిపారని, ఈ సందర్భంలోనే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలుగులో ఓ టీవీ ఛానెల్ ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చారని సమాచారం. దీంతో ఈ రిలయన్స్ టీవీ ద్వారా టీవీ 9ని గట్టి దెబ్బకొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారన్న టాక్ ఏపీ మీడియా సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో చంద్రబాబుకు అనుకూల మీడియా ఉన్నప్పటికీ.. టీవీ 9పై మాస్ ముద్ర పడడంతో ఎక్కువ శాతం మంది ఈ ఛానెల్ నే ఆదరిస్తున్నారు. దీంతో టీవీ 9 కి చెక్ పెట్టేస్తాయిలో రిలయన్స్ టీవీని ప్రారంభించే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.ఇక ఈ ఛానెల్ కోసం చంద్రబాబు తెరవెనక ఉండి అన్నీతానై నడిపిస్తున్నట్టు తెలిసింది.
Comments
Post a Comment