శ్వేతాబసు ప్రసాద్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్ వస్తోంది. సెక్స్ రాకెట్‌లో క్లీన్ చిట్‌తో ఉత్తరాది సినిమాల్లో కనిపిస్తూ ఉన్న శ్వేతాబసు ప్రసాద్.. ప్రస్తుతం దక్షిణాదిన నటించేందుకు సైతం మొగ్గుచూపుతుందట. అందుకే తనను సంప్రదించే నిర్మాతలకు ముందు వెనకా ఆలోచించకుండా సినిమాల్లో నటిస్తానని హామీ ఇస్తుందట.
కొత్త బంగారులోకం సినిమాతో ఇటు యూత్‌కు, అటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన శ్వేతాబసు, ఆపై అవకాశాల్లేక వ్యభిచార కేసులో పెట్టుబడి సంచలనం రేపిన సంగతి తెల్సిందే. ఆ కేసు నుండి ఎలాగోలా బయటపడిన శ్వేతా బసు ప్రసాద్, చాలారోజుల తర్వాత ఎట్టకేలకు ఓ తెలుగు చిత్రంలో నటిస్తోంది.
ఎంవీ సతీష్ దర్శకత్వం రూపుదిద్దుకుంటున్న మాస్ మసాలా చిత్రం "మిక్చర్ పొట్లం"తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు శ్వేతాబసు ప్రసాద్ రెడీ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోందని.. ఈ సినిమాలో శ్వేతాబసు ప్రసాద్ అందాల ఆరబోత ఓ రేంజ్‌లో ఉంటుందని టాక్ వస్తోంది. మిక్చర్ పొట్లం తన కెరీర్లో గోల్డెన్ ఛాన్స్ అంటూ శ్వేత సన్నిహితులతో చెప్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆమె వెల్లడిస్తోంది.
Comments
Post a Comment