*venugopal prtu*
*‘సర్జికల్ దాడుల’ రోజు చైనా ఎందుకు ఉలిక్కిపడింది?*
ఆ రోజు… ఇండియా వాస్తవాధీన రేఖ దాటి, పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ లోకి వెళ్లి, ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తున్న రాత్రి…. చైనా ఉలిక్కిపడింది… ఎందుకో తెలుసా? మామూలుగా కాదు, అసాధారణంగా!!
ఇది అర్థం కావాలంటే కాస్త ఓపికగా ఇది చదవాలి… అర్థం చేసుకోవాలి…. సర్జికల్ స్ట్రయిక్స్ జరుగుతున్నప్పుడు ఇరాన్ కూడా బెలూచిస్థాన్ (పాకిస్థాన్ లోని ఓ పడమర ప్రాంతం) వైపు మోర్టార్ షెల్స్ ప్రయోగించింది…. ఇండియా ఎల్వోసీ దాటి దాడులు చేస్తున్న విషయం చైనా పసిగట్టింది… కానీ ఇరాన్ మధ్యలో ఎందుకు స్పందిస్తున్నదో అర్థం కాలేదు… అందుకే ఉలిక్కిపడింది… ఇదెక్కడికి దారితీస్తుందని తలపట్టుకుంది… ఎందుకంటే….
ఇండియా వ్యూహాత్మకంగా ఏం ఆలోచించిందంటే…. పాకిస్థాన్ కు మిత్రుడైన చైనా ఈ వ్యూహాత్మక సర్జికల్ దాడులకు నెగెటివ్ గా స్పందిస్తుందేమోనని ఇండియా సందేహించింది… అందుకని వ్యూహాత్మకంగానే ఇరాన్ ను రంగంలోకి దింపింది… మనం చెప్పగానే ఇరాన్ ఎందుకు స్పందించింది? దానికీ ఓ కథ ఉంది….
ఇరాన్ కూ పాకిస్థాన్ కూ పడదు… రెండు పక్కపక్క దేశాలే… అయితే చైనా ప్రపంచశక్తిగా ఎదిగేందుకు, గల్ఫ్ ప్రాంతంలో తన పట్టు పెంచుకునేందుకు, అరేబియా సముద్రంపై గ్రిప్ సంపాదించి, పనిలోపనిగా ఇండియాకు చెక్ పెట్టేందుకు ఓ‘ వ్యూహం పన్నింది… సిల్క్ రూట్ పేరిట, ఎకనమిక్ కారిడార్ పేరిట కథలు పన్ని, పాకిస్థాన్ లోని గ్వదర్ పోర్టుకు నిధులిచ్చింది… అది ఎక్కడ ఉందో తెలుసా? పాకిస్థాన్ కు పడమరలో… అది ఎంతోకాలంగా పాకిస్థాన్ నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్న కాశ్మీర్ వంటి సమస్యాత్మక ప్రాంతం…. ఆ బెలూచిస్థాన్ లో తన నేవీ బేస్ ఏర్పాటు చేసుకుని, పాకీలను బకరాలను చేసి ఆడుకోవాలని అనుకున్నది చైనా… ఇది గమనించిన ఇరాన్, ఇండియా ఒక్కటయ్యాయి… ఇరాన్ లో చబహార్ పోర్టుకు ఇండియా నిధులిచ్చింది… అవసరమైతే ఇండియా అక్కడ అణు జలాంతర్గాములను మొహరించే చాన్స్ దొరికింది… ఈ మొత్తం ప్రక్రియకు అమెరికా మద్దతునిచ్చింది… ఇది చైనాకు షాక్… ఈ చబహార్ పోర్టు ఎక్కడ ఉంటుందంటే….? అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధికి సమీపంలో ఉంటుంది…
ఈ జలసంధి మొత్తం గల్ప్ దేశాలకు కీలకం… ఎంత అంటే…. ఓసారి యురేనియం తయారీ పేరిట ఇరాన్ ఆ జలసంధిని ఒకటీ రెండు రోజులు మూసేసింది… దీంతో చైనా గిలగిలా కొట్టుకుంది… అదీ ఎందుకో తెలుసా. ఇక్కడి నుంచి చైనాకు రోజుకు అయిదు లక్షల ముడి చమురు బ్యారెళ్లు వెళ్తాయి… అదీ కారణం… అవన్నీ అరేబియా సముద్రం నుంచి చైనాకు చేరుకునేవరకు కొన్ని వేల కిలోమీటర్ల సముద్రజలాలు ఇండియా పరిధిలోకి వస్తాయి… అలాంటి కీలకమైన ప్రాంతం కావడంతో ఇరాన్ ఏం చేస్తుందనేది ఎప్పుడూ చైనా గమనిస్తూ ఉంటుంది… ఒకేసారి ఇరాన్ పాకిస్థాన్ వైపు షెల్స్ ప్రయోగించడం మొదలుపెట్టిందో అప్పుడే చైనాకు షాక్ తగిలింది…. పరిస్థితి విషమిస్తే, చైనా గనుక పాకిస్థాన్ కు మద్దతుగా రంగంలోకి దిగితే ఇరాన్ కూడా వెంటనే రంగంలోకి దిగుతుందనే విషయం దానికి అర్థమైంది…. అది అర్థం కావటానికే ఇరాన్ ఆ పనికి పూనుకుంది…. అలాగే పాకిస్థాన్ సైన్యం దృష్టి మళ్లించడం అనేది అదనపు కారణం…
అంతేకాదు…. అమెరికా, ఇరాన్ తో కలిసి ఇండియా త్వరలోనే అరేబియా సముద్రజలాల్లో భారీ సైనిక విన్యాసాలనూ ప్రదర్శించబోతున్నది…. అది చైనాకు ఓ ముందస్తు హెచ్చరిక అన్నమాట…. ఇప్పుడు అర్థమైందా? చైనా ఆ రోజు ఎందుకు ఉలిక్కిపడిందో!!
ఎస్…. అంతర్జాతీయ రాజకీయాలు ఇలాగే ఉంటాయి…. సర్జికల్ దాడులకు ముందు ఇండియా ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో, ఎన్ని వ్యూహాలు రచించిందో చెప్పడమే ఈ వార్త ఉద్దేశం….

Comments
Post a Comment