"శ్రీభగవద్గీత మహత్మ్యం కధలు" "రెండవ అధ్యాయ మహత్మ్యం"

"శ్రీభగవద్గీత మహత్మ్యం కధలు"
"రెండవ అధ్యాయ మహత్మ్యం"
(Part-1)
పురందరపురం అనే గ్రామంలో 'దేవశర్మ' అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన అతిధిపూజలు, వేదాధ్యయనాలు, యజ్ఞాలు చేసినప్పటికి మనశ్శాంతి మాత్రం లభించలేదు. ఒకరోజు ఆయనకు మహాత్ముడయిన సాధువు ఒకరు కనిపించాడు. ఆ మహాత్ముని చూసి దేవశర్మ నమస్కరించి "మహాత్మా! నాకు శాంతి ఎలా లభిస్తుంది?" అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ మహాత్ముడు "దేవశర్మా! సౌపురం అనే గ్రామంలో 'మిత్రవంతుడు' అనే వ్యక్తి మేకలను మేపుకుంటూ ఉంటాడు. అతడు నీకు ఉపదేశం చేస్తాడు. వెళ్ళు" అన్నారు.
దేవశర్మ సౌపురగ్రామంలోని నది ఒడ్డున ఉన్న ఉద్యానవనంకు చేరుకుని, అక్కడ కూర్చున్న 'మిత్రవంతుని' చూసాడు. అతని కళ్లు ఆనందాతిశయంతో ప్రకాశిస్తున్నాయి. అతని దగ్గరలో పరస్పర విరోధ జంతువులన్నీ కలిసి తిరుగుతున్నాయి. దేవశర్మ అతని వద్దకు వెళ్ళి "మహాత్మా! ఆత్మజ్ఞానాన్ని గురించి నాకు తెలియచేయండి" అని ప్రార్ధించాడు.
అప్పుడు మిత్రవంతుడు 'మహనీయా! నేను ఒకసారి అడవిలో మేకలు మేపుతున్నప్పుడు ఒక పెద్దపులి కనిపించింది. ఆ పులి నా మేకలను, నన్ను చంపి తింటుందని భయం వేసింది. మేకలన్నీ పారిపోతున్నాయి. కానీ ఒక మేకమాత్రం భయం లేకుండా పులి వద్దకు వెళ్ళి "ఓ పులి! నన్ను చంపి తిని తృప్తి పొందు" అని చెప్పింది. అప్పుడు పులి "ఓ మేకా! నువ్వు ఇక్కడికి వచ్చినా నాకు నిన్ను చంపి తినాలి అనిపించడం లేదు. నా ఆకలి కూడా మాయమయ్యింది" అన్నది. అప్పుడు మేక "నాకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియట్లేదు. నీకు తెలిస్తే చెప్పు" అన్నది. అప్పుడు పులి "నాకూ తెలియదు" అని చెప్పి, ఆ రెండు కలసి నా దగ్గరకు వచ్చాయి అడగడానికి. వాటిని చూసి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది.
(ఇంకాఉంది...)

Comments