卐_______శ్రీభగవద్గీత________卐 ॐ ఒకటవ అధ్యాయము ॐ ॐ అర్జునా విషాదయోగము ॐ ॐ♛-♛•°•-ॐ-ॐ-•°•♛-♛ ॐ

రీకృష్ణపరబ్రహ్మణే నమః
శ్రీ సద్గురు పరమాత్మనే నమః - సర్వమహర్షిభ్యో నమః
గీతామకరంద వ్యాఖ్యాసహిత
ॐ♛-♛•°•-ॐ-ॐ-•°•♛-♛ॐ



卐_______శ్రీభగవద్గీత________卐
ॐ ఒకటవ అధ్యాయము ॐ
ॐ అర్జునా విషాదయోగము ॐ
ॐ♛-♛•°•-ॐ-ॐ-•°•♛-♛ ॐ




పూర్వచరిత్రతో ఈ అధ్యాయమునకు గల సంబంధము:-
మహాభారతయుద్ధము ప్రారంభమై పది రోజులు గడిచింది. భీష్ముడు రణరంగములో కూలీపోయెను. ఆ వృత్తాంతమును వెంటనే సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పిన తర్వత ఆతడు పలువిధలుగా శోకించి యుద్ధము మొదలుపెట్టిన నుంచి అప్పటి వరకు జరిగిన వృత్తాంతమును తెలుపవలసినదిగా సంజయుని కోరెను. అప్పుడు సంజయుడు ఇరువైపుల సైనికులు యుద్ధనికి సిద్ధంగవుండటం, రణక్షేత్రంలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి జ్ణానోపదేశము చేయడం లాంటి విషయాలు అన్నింటిని వివరముగ ధృతరాష్ట్రునకు తెలియజెప్పడు. అదే ఈ గీతశాస్త్రము.
అవతారిక:- యుద్ధము గూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు..
ధృతరాష్ట్ర ఉవాచ:-
ధర్మంక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మమాకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. (1-1)
తా||. ఓ సంజయా! నావారైన దుర్యోధనాదులు, పాండుపుత్రులగు ధర్మరాజాదులు యుద్ధము చేయలనే కుతూహలంతో పుణ్య భూమియగు కురుక్షేత్రంనికి చేరి ఏమి చెసిరి?.

Comments