సంవత్సరానికొకసారి వచ్చే దీపావళి పండుగలో ధ్వని, శబ్ద కాలుష్యం ఎత్తి చూపే మహామేధావుల్లారా...


మీకు ప్రతీరోజూ ప్రపంచవ్యాప్తంగా ప్రతీఊళ్ళో మతాలకతీతంగా కోటానుకోట్ల సిగరెట్లు తాగేవాళ్ళు కనిపించరా?
అది వాతావరణ కాలుష్యం కాదా?
మొబైల్ ఫోన్ల రేడియేషన్లు, తరంగాల వలన
చనిపోయే పక్షులు కనిపించవా?
మీకు ప్రతినిత్యం విషవాయువులొదిలే ఫ్యాక్టరీలు కనిపించవా?
అవి కాలుష్యం చేయట్లేదా?
మీకు ప్రతినిత్యం (మీతో సహా) ఉపయోగించే బైకులు, కార్లు, బస్సులు, ఇతర పెట్రోల్, డీజిల్, గ్యాస్ బళ్ళ పొగలు కనిపించట్లేదా? అవి విషవాయువులు కాక పరిమళాలు వెదజల్లుతున్నాయా?
వాటి ఇంజన్లు శబ్దకాలుష్యం చేయట్లేదా? వాటి హారన్లు విపరీతంగా మ్రోగిస్తూంటే చెవులు గళ్ళుపడట్లేదా?
అంతెందుకూ? ప్రతీ ఇళ్ళల్లలో టీవీలు, మ్యూజిక్ సిస్టంలు, ప్రతీ ఊళ్ళో లౌడ్ స్పీకర్ల నుండి ధ్వని కాలుష్యం రావట్లేదా?
గ్రీన్ హౌస్ వాయువుల్ని అరికట్టి ఓజోన్ పొరని రక్షించడానికి మీ
ప్రయత్నం ఏమిటి?
దీపావళివలనే భూమిమొత్తం వేడెక్కి ఒజోన్ పొర చిల్లులుపడుతోందా?
ఒకవేళ పటాసులే అంత విపత్తుని తెస్తున్నాయి అనుకొంటే విదేశాల్లో న్యూ ఇయర్ కి, మన దేశాల్లో ఫంక్షన్లకి, ఆఖరకి పంచాయితీ ఎలక్షన్లలో కూడా పటాసులు కాలుస్తున్నారు. అవి ఎందుకు మానట్లేదు? దీపావళి పండుగముందే కాలుష్యం గుర్తొచ్చే మీరు ముందు మోటారు వాహనాలేవీ వాడడం మానేయండి. సిగరెట్ల అలవాటుంటే మానేయండి.ప్రమాదకర కాలుష్యం ఏది కనిపించినా ఆపేవరకు ప్రయత్నించండి. అనవసర శబ్దాలు ఎక్కడ
వస్తున్నా ఆపించండి. భూతాపానికి కారణాలు నిర్మూలించండి. అలా చేయగలిగితేనే లక్షలాది దీపావళుల కాలుష్యం కన్నా ఎక్కువ. అవేమీ చేయకుండా కేవలం దీపావళికాలుష్యం మీదనే అరవడమనే ఫ్యాషన్ మాని పనిలోకి దిగండి. ప్రతీరోజూ కాలుష్యనివారణకి పూనుకోండి.....!!!!!!

Comments