వైర్‌లెస్ ఛార్జింగ్ ఎలా పని చేస్తుంది? వైర్‌లెస్ ఛార్జింగ్ వెనుక ఉన్న ప్రధానమైన వాళ్ళు ఎవరు అలాగే వారి విధానంలో తేడాలు ఏమిటి?

ఫారడే విద్యుతయస్కాంత ప్రేరణ నియమం ప్రకారం ఒక కండక్టర్(వాహకం) మరియు అయస్కాంత క్షేత్రం(Magnetic field),రండింటిలో ఎదో ఒకటి మరొకదానికి సాపేక్షంగా మారుతున్నప్పుడు కండక్టర్లో విద్యుఛ్ఛాలక బలం(EMF) ప్రేరేపించబడుతుంది.ఒకవేళ కండక్టర్ వలయంగా(Closed loop)ఉంటే అందులో విద్యుత్ ప్రవహిస్తుంది.
వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ నియమం ఆధారంగా పనిచేస్తుంది.ఇందులో రెండు భాగాలు ఉంటాయి.
1).ట్రాన్స్మిటర్ కాయిల్(Transmitter coil)
2).రిసీవర్ కాయిల్(Receiver coil)
ట్రాన్స్మిటర్ కాయిల్లో ఏసీ కరంటు ప్రవహించినప్పుడు,దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం(Magnetic field) ఏర్పడుతుంది.ఈ అయస్కాంత క్షేత్రంకి సమయంతో పాటు మారే(time-varying) గుణం ఉంటుంది.ఈ అయస్కాంత క్షేత్రంలో రిసీవర్ కాయిల్ని గానీ ఉంచితే దాని వల్ల రిసీవర్ కాయిల్లో విద్యుఛ్ఛాలక బలం(EMF) ప్రేరేపించబడుతుంది.దాని వలన రిసీవర్ కాయిల్లో విద్యుత్ ప్రవహిస్తుంది.ఇక్కడ ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ కాయిల్ అంటే వలయంగా చుట్టబడిన తీగ.
వైర్లెస్ ఛార్జింగ్ పధ్ధతిలో ,రిసీవర్ కాయిల్ అనేది మనం ఏ పరికరంకి అయితే ఛార్జింగ్ పెట్టాలో దాంట్లో అమర్చి ఉంటుంది.ట్రాన్స్మిటర్ కాయిల్ అనేది బేస్ ప్లేట్లో(సోర్స్) అమర్చి ఉంటుంది.
ఉదా:-
1)వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్లో,రిసీవర్ కాయిల్ ఫోనులో అమర్చి ఉంటుంది అలాగే ట్రాన్స్మిటర్ కాయిల్ ఆ క్రింద ఉన్న నల్లటి బేస్ ప్యాడ్లో అమర్చి ఉంటుంది.
2)వైర్లెస్ బ్రష్ ఛార్జింగ్లో,రిసీవర్ కాయిల్ బ్రష్ లోపల అమర్చి ఉంటుంది అలాగే ట్రాన్స్మిటర్ కాయిల్ ఆ క్రింద ఉండే ప్యాడ్లో అమర్చి ఉంటుంది.
నికోలస్ టెస్లా మొదటిసారిగా 1899 లో వైర్లెస్ కరంటును ప్రవహింపచేసాడు.1899 లో రెజోనంట్ కప్లింగ్ ద్వారా సోర్స్ నుంచి 25 మైళ్ళ దూరంలో ఉన్న లైట్లను వెలిగించగలిగాడు.అయితే వైర్లెస్ కరంటు మీద ప్రయోగాలు చేయడానికి తగిన డబ్బులు లేనందు వలన టెస్లా దాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు.
ప్రస్తుతం వైట్రిసిటీ(Witricity) అనే కంపనీ ఈ టెక్నాలజీనీ అభివృద్ధి చేస్తుంది.ఈ కంపనీ రెజోనంట్ టెక్నాలజీ మీద లైసెన్స్ కూడా తీసుకుంది.
ఇమేజ్ క్రెడిట్స్:-గూగుల్

Comments