హిందూ ధర్మాన్ని భారతదేశాన్ని నాశనం చేయటానికి పాశ్చత్యులు వాడుతున్న ఆయుధం ఈ క్రూరత్వ సాహిత్యం
కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందుత్వంపై దాడి జరుగుతుంది చాలామంది మతాలవారు దేశంపై అనుకోకుండా దాడిచేసి దేశాన్ని నాశనం చేసి వాళ్ళ మతాలను భారతంలో స్థాపించడమే లక్ష్యంగా దాడులు చేస్తూ వచ్చారు ఇస్లాం మతస్తులు
ఇలా దండయాత్రలు చేసిన మహమ్మదీయులు భారతంలో దేవాలయాలను కూల్చారు మన గ్రందధాలయాలను గ్రంధాలను తగులబెట్టారు ఎన్ని యుధ్ధాలు దండయాత్రలు చేసిన దేశం దేశ ఉనికి అయిన ధర్మాన్ని దూరం చేయలేకపోయారు ఇలా మహమ్మదీయులు వెళ్ళిన తరువాత మనదేశం మీదకి బ్రిటీష్ వారు వచ్చారు. అప్పటి నుంచి మొదలయింది ఈ క్రూరత్వ సాహిత్యం.
అసలు క్రూరత్వ సాహిత్యం అంటే ఏమిటి:
ఏదైనా ఒక సంస్క్రుతిని నిర్వీర్యం చేయటానికి ఆ సంస్కృతి పాటించేవాళ్ళకి ఆ సంస్కృతి మీదే తప్పుడు భావన కలిగేలా చేసేదే ఈ క్రూరత్వ సాహిత్యం
మొదటగాఇందులో వాళ్ళు నాశనం చేయటానికి ఒక సంస్క్రుతిని ఎంచుకుంటారు అలా ఎంచుకున్న తరువాత ఆ సంస్కృతిలో ఉన్న ఆచారాలను నియమాలననియమాలను పూర్తిగా అందులో ఉండే వ్యవస్థను నిర్విర్యం చేస్తారు. ముందుగా వాళ్ళు ఒక నాగరికతను ఎంచుకుని అందులో తన వారిపైనే ఆ నాగరికత వివక్ష చూపిస్తుందని హింస సాగిస్తుందని అందులో పాశ్చాత్యులు జోక్యం చేసుకుని ఆ నాగరికలో ఎవరైతే హింసకి వివక్షకి గురయ్యారు అనుకున్నారో వాళ్ళను మేమే రక్షిస్తామని నమ్మిస్తారు. ఇది ఎంతలా ఉంటుంది అంటే చివరికి ఎవరైతే హింస చేస్తున్న వర్గం అనుకుంటారో వారు కూడా నమ్మేస్తారు చివరికి హింసకి గురికాబడుతున్నాము అనే వారు పాశ్చాత్యుల దగ్గరకే వెళ్ళి రక్షణ కోరుకుంటారు.
ఉదాహరణకి ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. ఏదైనా ఒక ప్రాంతంలో కొన్ని కోట్లమంది నివసిస్తున్నారనుకుందాం అందులో తెల్లవారు,నల్లవారు,పొట్టివారు,పొడుగువారు ఇలా చాలామంది నివసిస్తారు . అంత జనాభా ఉన్న ప్రాంతంలో ఏదో ఒక కారణం చేత తప్ఫకుండా గొడవలు జరుగుతాయి ఆ గొడవల్లో కొట్టుకున్న ఇద్దరూ ఒక వర్గానికి చెందినవారైతే పరువాలేదు. కాని తెల్లవాడు నల్లవాడు కొట్లాడుకుంటే అందులో పాశ్చాత్యులు దూరి కధను మొత్తం మార్చేస్తారు. నిజానికి వారు కొట్లాడుకున్న కారణం వేరే అయి ఉంటుంది. కాని వాళ్ళిద్దరూ వేరు వేరు వర్గానికి చెందినవారన్నది వాస్తవం. దీనిని ఆధారంగా చేసుకుని తెల్లవాళ్ళు నల్లవాళ్ళను హింసిస్తున్నారని వివక్ష చూపుతున్నారని ప్రచారం మొదలు పెడతారు.దీనికి వార్తాపత్రికలు, టివి చానళ్ళు తోడైతే దాని ప్రభావం ప్రజల మీద చాలా విపరీతంగా ఉంటుంది. ప్రజలు ఆ వార్తలకు దూరంగా ఉండటం వలన టివి చానళ్ళు,వార్తాపత్రికలు వార్తలనే నిజం అని నమ్ముతారు .
ఈ భావజాలాన్ని నెమ్మదిగా ప్రజల పుర్రెలకి ఎక్కిస్తారు
ఈ వార్తలను విన్నకా తెల్లజాతి చెందినవారిలో నిజంగానే మేము అనే భావన కలుగుతుంది అలాగే అదే జాతిలో ఉన్న కొంతమందికి మా వాళ్ళు ఇన్ని దారుణాలు చేస్తున్నారా వాళ్ళ వర్గం మీద వాళ్ళకే ద్వేష భావం కలుగుతుంది. అదే నల్లజాతివారు కొంతమందికి సంస్ర్కతిపై చిరాకు, కోపం, అసహ్యం పుడుతుంది. కొంతమందికి బానిసత్వం అలవాటయిపోతుంది ఇలా వాళ్ళకి తెలియకుండానే ఆ నాగరికతలో ప్రతి వ్యక్తి మనస్సును, ఆలోచనలను మార్చేస్తారు ఆ ప్రాంతంలో జనాభా మొత్తాన్ని పాశ్చత్యులు వాళ్ళకి మానసిక బానిసలుగా మార్చేసుకుంటారు.ఇలా ఆ సంస్ర్కుతివాసుల్లో వాళ్ళకి బానిసలు పెరుగుతున్న కొద్ది అందులో కొంతమందిని తెలివైనవారిని ప్రముఖ రంగాల్లో అంటే సినిమా,రచన,పాత్రికేయ రంగాల్లో ఉన్న వాళ్ళ బానిసలను అడ్డుపెట్టకుని వాళ్ళ సిధ్ధాంతం జనబాహుళ్యంలోనికి చొచ్చుకుపోయేలా చేస్తారు. ఎంతలా అంటే వాళ్ళకి మనం ఎన్ని ఆధారాలతో నిజాలను చెప్పటానికి ప్రయత్నించినా నమ్మరు పట్టించుకోరు ఇలా వాళ్ళు సంస్కృతి మొత్తం నాశనం అయ్యేవరకు ఆ నాగరికతపై దాడి చేస్తునే ఉంటారు. ఇక్కడ మీరు తెల్లవారి స్థానంలో మన హిందూ ధర్మాన్ని పెట్టి చూస్తే మీకే అర్ధమవుతుంది.
స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి స్త్రీలను హిందుత్వంలో చిన్న చూపు చూస్తున్నారు అని ఇక్కడ ఉన్నదంతా పురుషాదిక్యసమాజం అని స్త్రీలకి స్వేచ్చ అనేది హిందూ ధర్మంలో లేదని చూపిస్తూ ఎక్కువ విడాకులు అయ్యేలా చేసి కుటుంబ వ్యవస్థను నాశనం చేశారు ఇలా భారతంలో ఉమ్మడి కుటుంబాలు అనేవి లేకుండా చేసారు .
ఈ సందర్బంగా మీకు ఒక విషయాన్ని గుర్తుచేయాలనుకుంటున్నాను మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉండే పాఠ్యంశాలలో చాలా వరకు ప్రతిచోట పెద్దకుటుంబం చిన్నకుటుంబం అని రెండింటి గురించి ప్రస్తావన ఉంటుంది. అందులో పెద్దకుటుంబాల(ఉమ్మడి కుటుంబాలు) వలన ఎక్కువ నష్టం ఉందని చిన్నకుటుంబాల (విడి కుటుంబాలు) వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని ఉంటుంది ఈ సారంశం దాదాపు నాలుగు ఐదవ తరగతుల వరకు ప్రతి విద్యాసంవత్సరంలోను ఉంటుంది ప్రతీ ఏడాది ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చదువును కొనసాగిస్తారు. అంటే మనకు తెలియకుండానే మన కుటుంబ వ్యవస్థపై మనకు ఈర్ష్య పుట్టేలా చేసారు. దానివలన ఇప్పుడు మనం ఈ పరియవసానాన్ని ఎదుర్కొంటున్నాం ఎందరో పిల్లలు తమ తల్లిదండ్రులను బయటకు వదిలేయడం కేవలం కొన్ని సంవత్సరాలలోనే దేశంలో అన్నిచోట్ల వృద్దాశ్రమాలు కుప్పలు తెప్పలుగా వెలసాయి. ఇదంతా మనకి స్వాతంత్ర్యం రాగానే మతోన్మాదులైన రాజకీయ నాయకులు శవాలమీద చిల్లర ఏరుకునే కమ్యూనిస్టులు మనల్ని పాలించడం వలన దేశానికి పట్టిన దుస్థితి ఇది ఇప్పటికైనా మేలుకుందాం దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం
https://www.prajatelugu.xyz/2020/06/blog-post_23.html?m=1
Comments
Post a Comment